కోట మృతికి ప్రధాని సంతాపం

ట్విట్టర్ వేదికగా సందేశం;

Update: 2025-07-13 13:19 GMT

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు.

కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి అని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Tags:    

Similar News