కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించండి, సీఎంకు ప్రొఫెసర్ల వినతి
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని పలువురు ప్రొఫెసర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.;
By : The Federal
Update: 2025-04-27 13:42 GMT
తెలంగాణకు చెందిన ప్రొఫెసర్లు, మేధావులు,శాంతి చర్చల కమిటీ నేతలు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని పలువురు ప్రొఫెసర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. సీఎం ను కలిసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ లు ఉన్నారు.
కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ నేతలు కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని సీఎంను విజ్ఞప్తి చేశారు.కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ని కోరారు.
మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : సీఎం
నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతిభద్రతల అంశంగా పరిగణించదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డి కి ఉందన్నారు. ఈ అంశంలో సీనియర్ నేత జానారెడ్డి సలహాలు,సూచనలు తీసుకుంటామని సీఎం చెప్పారు. దీనిపై మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.