తెలంగాణలో కోటి బీసీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం...

బీసీ యువకులకు నాయకులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలి: వకులాభరణం;

Update: 2025-05-25 13:16 GMT

తెలంగాణాలో బీసీల సమైక్యతను, సంఘటిత శక్తిని పెంపొందించే దిశగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగా బీసీల కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి , విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, మాజీ బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ ల చేతుల మీదుగాబీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ లాంఛనంగా ప్రారంభించారు..


కార్యక్రమ ప్రాధాన్యతను వివరిస్తూ దాసు సురేశ్ ప్రారంభోపన్యాసం గావించారు. తెలంగాణాలో బీసీల సమైక్యతను, సంఘటిత శక్తిని పెంపొందించే దిశగా ప్రతిష్టాత్మకంగా "బీసీల కోటి సభ్యత్వ నమోదు" కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామన్నారు..బీసీ రాజ్యాధికార సాధన కోసం మొదటి విడతగా పది లక్షల మంది కార్యకర్తల సభ్యత్వ నమోదును జూన్ నెల చివరి వరకు పూర్తి చేస్తామన్నారు. గ్రామ,వార్డు,మండల,బస్తీ పట్టణ ,నియోజకవర్గ, జిల్లాలా వారీగా సభ్యత్వాల నమోదు కొనసాగుతున్నదనీ తదనంతరం ఎన్నికలు జరిగే గ్రామ పంచాయితీలు , మండేలాలు , నియోజకవర్గాల వారీగా పటిష్ట కమిటీల నిర్మాణం చేపట్టనున్నామని తెలియాచేసారు.15 సంవత్సరాలు పైబడిన ప్రతీ బీసీ బిడ్డకు సభ్యత్వ నమోదు అందుబాటులో ఉండనున్నదనీ, ఆన్లైన్లో కూడా సభ్యత్వ నమోదు ఫ్రీ గా చేసుకునే వెసులుబాటు కల్పించామని దాసు సురేశ్ పేర్కొన్నారు..క్రియాశీలక నాయకులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించనున్నామనీ.. బీసీలకు నాయకత్వం చేపట్టాలనే ఆసక్తి కలిగిన యువ నాయకులకు,మహిళలకు అన్ని కమిటీలలో అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు..

కోటి సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి బీసీ నాయకులు , ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో బీసీలు ఎక్కువ మొత్తంలో ప్రజాప్రతినిధులు కావడానికి ఈ సభ్యత్వ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుందని అన్నారు.

బీసీ ఇంటెలెక్టువల్ ఫోరమ్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ ఒకప్పటిలా కాకుండా నేడు బీసీలు చాలా చైతన్యవంతంగా ముందుకు వెళ్తున్నారని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో బీసీ నాయకులు కోటి బీసీ నాయకుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన విజయవంతం చేయడానికి ప్రతి బీసీ బిడ్డ కార్యోన్ముఖులుగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు..

మాజీ బీసీ కమీషన్ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రతి బీసీ బిడ్డ నేను బీసీ రాజ్యాధికార సమితిలో ఒక సభ్యత్వం పొందిన వ్యక్తినని సగర్వంగా చెప్పుకునే విధంగా కోటి బీసీల సభ్యత్వాలను నిర్ణీత కాలంలో పూర్తిచేసి బీసీ నాయకులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలన్నారు.

బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రాజ్యాధికారం మరియు కోటి బీసీ సభ్యత్వ కార్యక్రమాలను ప్రారంభించడం నూతన అధ్యాయానికి నాంది అని తెలిపారు.దాసు సురేశ్ బృందం చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు .

ఈ కార్యక్రమంలో మాజీ ఎం బి సీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జాతీయ బీసీ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ,ఎర్ర సత్యనారాయణ , నందగోపాల్ , అడ్వకేట్లు శ్రీనివాస్ యాదవ్ , వంశీ కృష్ణ , రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకురాలు అరుణశ్రీ ,ప్రోగ్రామ్ కన్వీనర్ వైద్య రాజగోపాల్ , స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి వీరేందర్ గౌడ్, వంగ రవి, చిలువేరు రవీందర్, జిహెచ్ఎంసి మహిళా నాయకురాలు బండారు పద్మావతి, బొమ్మ నరేందర్, మంద వెంకటస్వామి,భాగ్యలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు


Tags:    

Similar News