PV SINDHU |వేడుకగా పీవీ సింధూ నిశ్చితార్థం
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ నిశ్చితార్థం వేడుకగా సాగింది.వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో పీవీ సింధూ నిశ్చితార్థ వేడుక కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది.;
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ, హైదరాబాద్ నగరానికి చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో నిశ్చితార్థ వేడుక శనివారం కోలాహలంగా జరిగింది. ఈ నెల 22వతేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. సింధు గారు తల్లిదండ్రులతో పాటుగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. @Pvsindhu1 pic.twitter.com/KAeahufBE8
— Telangana CMO (@TelanganaCMO) December 14, 2024