రఘునందన్ కు బెదిరింపు కాల్
మావోయిస్టుపార్టీ నుంచి అనే అనుమానం;
బిజెపి ఎంపీ రఘునందన్ కు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తాం అని గుర్తు తెలయని వ్యక్తులు కాల్ చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీ పేరుతో ఈ బెదిరింపు కాల్ వచ్చింది.
మేడ్చెల్ నియోజకవర్గంలోని దమ్మాయి గూడలో ఓ ప్రయివేటు పాఠశాల వేడుకలో రఘు నందన్ పాల్గొన్న సమయంలో బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన పిఏ ఫోన్ లిప్ట్ చేశాడు. సాయంత్రం లోపు చంపేస్తామని బెదిరించారు.
బిజెపి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజ్ భవన్ సమీపంలో సోమవారం ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్ కు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రఘు నందన్ మేడ్చెల్ ఎస్పి, డిజిపికి లకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.