‘రాహుల్, రేవంత్ ఇద్దరూ హీరోలే’

దేశ ప్రజల సంక్షేమం విషయంలో రాహుల్ గాంధీ ముందు చూపుతో ఉన్నాడని చెప్పడానికి కులగణన అతిపెద్ద ఉదాహరణ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.;

Update: 2025-05-01 13:21 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ హీరోలేనన్నారు. రాహుల్ గాంధీ.. దేశ రాజకీయాల్లో హీరో అయితే.. రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హీరో అని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కుల గణన ప్రధాన అంశమని, కులగణన చేయాలని రాహుల్ గాంధీ పదేపదే చెప్పారని గుర్తు చేశారు. ఆయన సూచనల మేరకే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసిందని చెప్పారు. ఈ కులగణను తొలుత నుంచి వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు తమ ఒత్తిడికి తలొగ్గి కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమం విషయంలో రాహుల్ గాంధీ ముందు చూపుతో ఉన్నాడని చెప్పడానికి కులగణన అతిపెద్ద ఉదాహరణ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అదే విధంగా రాష్ట్రంలో అత్యంత పాదర్శకంగా కులగణన చేసినందుకు రేవంత్ రెడ్డి కూడా హీరోనే అని అన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు ఎంత సంకలు గుద్దుకున్నా లాభం లేదని, కుల గణనకు మోదీ ఓకె చెప్పికపోయి ఉంటే ప్రధాని అయిన వెంటనే రాహుల్ గాంధీ.. దీనిని చేసేవారని తెలిపారు.

అంతేకాకుండా రాష్ట్ర కులగణన లెక్కల్లోకి రానివారు.. కేంద్రం చేపట్టే కులగణన లెక్కలోకి వస్తారని కూడా జగ్గారెడ్డి తెలిపారు. ఇప్పుడు చెప్పిన మాట మోదీ.. రెండేళ్ల క్రితమే చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. ఇన్నాళ్లూ కూడా తాము ఓకే చెప్తే క్రెడిట్ ఎక్కడ రాహుల్ గాంధీకి వెళ్లిపోతుందో అని బీజేపీ నేతలు అనుకున్నారని, ఆ విషయం వారికి మింగుడు పడకనే ఇన్నాళ్లూ ఆగారని అన్నారు. రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోదీకి ఎందుకు రాలేదు? బీజేపీ వాళ్ల మాదిరిగా రాహుల్ పదవుల కోసం ఎదురుచూసే రకం కాదు అని అన్నారు.

Tags:    

Similar News