హైద్రాబాద్ లో భారీ వర్షం

దంచి కొట్టింది;

Update: 2025-06-30 15:42 GMT

హైద్రాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. మృగ శిర కార్తె తర్వాత ఇంత భారీ వర్షం కురవడం ఇదే ప్రథమం. నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే తెలంగాణలో ప్రవేశించినప్పటికీ వర్షాలు పడలేదు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అల్వాల్, తిరుమలగిరిలో భారీ వర్షం కురిసింది. సాయంత్రంపూట అందరూ ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్ లో ఈదురు గాలులతోకూడిన గాలులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

గత వారం రోజుల నుంచి ఉక్కపోత ఉంది. వర్షాకాలంలో ఉక్కపోత ఉండటం పలువురు విస్మయం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం సడెన్ గా వర్షాలు పడగానే నగరం ఒక్కసారిగా చల్లబడింది.

Tags:    

Similar News