RANGA REDDY | జడ్జీపైకి చెప్పు విసిరిన దోషి, కోర్టులో కలకలం

రంగారెడ్డి ఫోక్సోకోర్టులో ఓ ఘటన కలకలం రేపింది.పోక్సో కేసులో కరణ్ సింగ్ ను న్యాయమూర్తి దోషిగా ప్రకటించారు.సింగ్ చెప్పును న్యాయమూర్తి పైకి విసిరాడు.;

Update: 2025-02-13 10:50 GMT

రంగారెడ్డి జిల్లా ఫోక్సో ప్రత్యేక కోర్టులో గురువారం జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. పోక్సో కేసులో నిందితుడైన కరణ్ సింగ్ ప్రత్యేక ఫోక్సో కేసు న్యాయమూర్తి దోషిగా ప్రకటించారు. అంతే దోషి కరణ్ సింగ్ బోనులో నుంచి ఆగ్రహంతో ఒక్కసారిగా చెప్పును న్యాయమూర్తి పైకి విసిరాడు.

- తనను దోషిగా న్యాయమూర్తి ప్రకటించడాన్ని జీర్ణించుకోలేక పోయిన కరణ్ సింగ్ న్యాయమూర్తిపైనే చెప్పు విసిరాడని ప్రత్యక్ష సాక్షులైన న్యాయవాదులు చెప్పారు.దీంతో అప్రమత్తమైన న్యాయవాదులు దోషి కరణ్ సింగ్ ను  పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.
-జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోనే గతంలో కరణ్ సింగ్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైంది. ఫోక్సో కేసులో జడ్జి కరీంకు యావజ్జీవ శిక్ష విధించారు. యావజ్జీవ శిక్ష విధించారన్న కోపంతోనే జడ్జిపై దోషి చెప్పువిసిరాడు. ఈ ఘటనతో రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టులో కలకలం ఏర్పడింది.జైలర్ కొడుతున్నాడని దోషి చెప్పడంతో వినేందుకు న్యాయమూర్తి ముందుకు పిలిచారు. ముద్దాయి సమస్యలు వింటుంటే జడ్జిపై చెప్పుతో దాడి చేశారని వెల్లడైంది.

పోలీసులపై కరణ్ సింగ్ గతంలో హత్నాయత్నం చేశాడని సమాచారం.మహిళా జడ్జీపై దాడికి నిరసనగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ముద్దాయి దాడికి నిరసనగా అన్ని కోర్టుల్లో ఆందోళన చేయాలని నిర్ణయించారు. బార్ అసోసియేషన్ నిరసన తెలిపింది. కరణ్ సింగ్ పై పలు కేసులున్నాయని సమాచారం. ఎస్కార్టు పోలీసులు దాడి జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాదులు ఆరోపించారు.పోలీసులు కరణ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.




 



Tags:    

Similar News