ఎమ్మెల్సీ దండే విఠల్ కి సుప్రీం కోర్టులో రిలీఫ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ కి సుప్రీం కోర్టులో రిలీఫ్ దక్కింది. ఎన్నిక చెల్లదంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.

Update: 2024-05-17 13:22 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ కి సుప్రీం కోర్టులో రిలీఫ్ దక్కింది. ఎన్నిక చెల్లదంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

బీఆర్ఎస్ నేత దండె విఠల్ 2021 లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇదే స్థానానికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డి పోటీ తనకి నష్టం కలిగించొచ్చు అని భావించిన విఠల్.. ఆయనని పోటీ నుంచి విరమింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలించలేదు.

అయితే నామినేషన్ల ఉపసంహరణ సమయంలో.. రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో రాజేశ్వర్ రెడ్డి తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, ఎవరో తన సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలు దాఖలు చేశారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం మే 3 న తీర్పు చెప్పింది. నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై ఉన్న సంతకం రాజేశ్వర్ రెడ్డిది కాదని తేల్చింది. విఠల్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడంతోపాటు విఠల్ కి రూ. 50,000 జరిమానా కూడా విధించింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ విఠల్ సుప్రీం కోర్టుని ఆశ్రయించగా నేడు స్టే వచ్చింది.

Tags:    

Similar News