జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు పూర్తి..
జీఓ విడుదల చేసిన సర్కార్.
తెలంగాణ స్థానిక ఎన్నికల సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా పరిషత్(జడ్పీ) ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. గతేడాది నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం ఈ రిజర్వేషన్లను ఖరారు చేశారు. బీసీలకు 13 జిల్లాలు రిజర్వ్ కాగా మిగిలిన ఎనిమిది జిల్లాలు జనరల్ కేటగిరీకి కేటాయించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుందనే చెప్పాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీఓ విడుదల చేసిన 24 గంటల వ్యవధిలోనే పంచాయతీరాజ్ శాఖ.. జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడం గమనార్హం.
రిజర్వేషన్లు ఇలా
1) సంగారెడ్డి - SC
2) రాజన్న సిరిసిల్ల -SC
3) రంగారెడ్డి - SC
4) జనగాన్ SC
5) జోగులాంబ గద్వాల్ SC
6) వికారాబాద్ - SC
1) ములుగు - ST
2) వరంగల్ - ST
3) ఖమ్మం ST
4) నల్గొండ ST
1) సిద్దిపేట - BC
2) కరీంనగర్ - BC
3) మేడ్చల్ మల్కాజ్గిరి BC
4) యాదాద్రి - BC
5) నిజామాబాద్ - BC
6) వరంగల్ అర్బన్ - BC
7) వనపర్తి - BC
8) మహబూబునగర్ - BC
9) జయశంకర్ - BC
10) నిర్మల్ - BC
11) సూర్యాపేట - BC
12) నగర్ కర్నూల్ - BC
13) మంచిర్యాల - BC
1) పెద్దపల్లి - OC
2) జగిత్యాల - OC
3) నారాయణపేట -OC
4) కామారెడ్డి - OC
5) మెదక్ - OC
6) ఆసిఫాబాద్ - OC
7) ఆదిలాబాద్ - OC
8) మహబూబాబాద్ - OC
9) భద్రాద్రి కొత్తగూడెం - OC
ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. దానిని స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కావడం కీలకంగా మారింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో జీఓ విడుదల చేయడంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. మరి ఆ సమాధానంలో ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రస్తావన ఉంటుందా? లేదా? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కీలకంగా మారింది. తదుపరి విచారణలో రిజర్వేషన్లకు ఆమోద ముద్ర పడకుండా ఎలా ఖారారు చేశారు? అని న్యాయస్థానం ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుంది? అన్న ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.