మహారాష్ట్రలో కూడా ‘స్టార్’ రేవంతేనా ?
మహా ఎన్నికల్లో రేవంత్ ను కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేర్కన్నది.
తెలంగాణా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముంబాయ్ చేరుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల విమానాంలో బయలుదేరి ముంబాయ్ చేరుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Elections) ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్(Revanth) ముంబాయ్(Mumbai) చేరుకున్నారు. ముంబాయ్ సిటీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేవంత్ ప్రచారం చేస్తారని పార్టీవర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం రేవంత్ మొదటిసారి ముంబాయ్ వెళ్ళారు. ఎందుకంటే మహా ఎన్నికల్లో రేవంత్ ను కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధిష్ఠానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేర్కన్నది. ఉదయం నుండి రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొనే రేవంత్ తిరిగి రాత్రికి హైదరాబాద్(Hyderabad) చేరుకుంటారు. ఎన్నికలు అయ్యేవరకు ముంబాయి సీటీలో తెలుగువాళ్ళుండే నియోజకవర్గాల్లో రెగ్యులర్ గా ప్రచారం చేయబోతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. మహా వికాస్ అఘాడి కూటమిగా ఎన్సీపీ(NCP), శివసేన(ఉత్ధవ్)(Shiv sena పార్టీలతో కలిసి పోటీచేస్తున్న కాంగ్రెస్ అత్యధిక సీట్లలో గెలవటమే కాకుండా అధికారంలోకి కూటమిని తీసుకురావటం అత్యంత అవసరంగా భావించింది. తొందరలోనే అంటే 2026-27లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అందుకనే ఎక్కడికక్కడ లోకల్ ఫ్లేవర్ ను ఎన్నికల్లో అద్దుతోంది. గతంలోలాగ జాతీయ పార్టీ నేతలను రంగంలోకి దింపకుండా వీలైనంతలో స్ధానిక నేతలను, ముఖ్యమంత్రులను ప్రచారంలోకి దింపి జనాలను ఆకట్టుకునేట్లుగా వ్యూహాలు అమలుచేస్తోంది. తెలంగాణా ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారెంటీల హామీల్లాంటివే మహారాష్ట్రలోను పార్టీ ఇవ్వబోతోంది.
ఇందులో భాగంగానే తెలంగాణా(Telangana)తో సరిహద్దులు పంచుకుంటున్న మహారాష్ట్రలో రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలతో ప్రచారం చేయించబోతోంది. ముంబాయ్ సిటీలో రేవంత్ ప్రచారం చేస్తుంటే సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్(Adilabad), నిజామాబాద్(Nizamabad), కరీంనగర్(Karimnagar) జిల్లాల నుండి మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు ప్రచారం చేయబోతున్నారు. మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలు, తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ఔరంగాబాద్(Aurangabad), నాంథేడ్, యవత్మాల్, థానే, అమరావతి(Amaravati), షోలాపూర్(Sholapur), చంద్రాపూర్ తదితర జిల్లాలు, ప్రాంతాల్లో తెలంగాణా ప్రజాప్రతినిధులు ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయం ఇలాగుంటే ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ధనసరి సీతక్కతో పాటు మరికొందరు ఎంఎల్ఏలు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. వీరంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో విడతలవారీగా వెళ్ళి ప్రచారం చేసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు.