రేవంత్, చంద్రబాబు, పవన్ సుడిగాలి పర్యటన
రేవంత్ రెడ్డి ,చంద్రబాబునాయుడు ,పవన్ కల్యాణ్, మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం
తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ డిప్యుటి సీఎం మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి(RevanthReddy), చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), పవన్ కల్యాణ్(Pawankalyan) మహారాష్ట్ర(Maharashtra)లో జరగబోతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు. రేవంత్ ఏమో ఇండియాకూటమిలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)(MVA) తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇక చంద్రబాబు, పవన్ ఎన్డీయే(NDA) కూటమిలోని పార్టీల తరపున ప్రచారం చేయబోతున్నారు. రేవంత్ ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసున్నారు. ఈరోజు మూడోసారి వెళుతున్నారు. శని, ఆదివారాల్లో రోడ్డుషోల్లో రేవంత్ బిజీగా ఉంటారు. ముగ్గురు కూడా తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్డుషోలు, బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు.
చంద్రబాబు ఢిల్లీ(Delhi) పర్యటనను మధ్యాహ్నం ముగించుకుని సాయంత్రానికి ముంబాయ్ చేరుకుంటారు. రాత్రి రాణే, భివాండీలలో జరగబోతున్న బహిరంగసభల్లో పాల్గొంటారు. రాత్రికి ముంబాయ్(Mumbai) లోనే బసచేస్తున్న చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం సియోన్ కోలివాడ, వర్లీ(Worli) ఎన్నికల సభల్లో పాల్గొంటారు. నగరంలోనే ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్(World Trade Centre) లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఆదివారం రాత్రికి అమరావతి(Amarathi)కి చేరుకుంటారు. పవన్ పర్యటన కూడా చాలా టైట్ షెడ్యూల్లోనే జరగబోతోంది. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నాందేడ్ జిల్లాలోని డెగ్లూర్, బోకర్, లాతూర్ సభల్లో పాల్గొంటారు. రాత్రికి షోలాపూర్(Sholpur) చేరుకుని రోడ్డుషోలో పార్టిసిపేట్ చేస్తారు. ఆదివారం బల్లాపూర్, కప్పా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. పనిలోపనిగా పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం రోడ్డుషోలో కూడా పవన్ పాల్గొంటారు.