చెన్నైకి రేవంత్.. డీలిమిటేషన్‌పై స్వరం వినిపించడానికే..
కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా శనివారం డీఎంకే ఆధ్వర్యంలో జేఏసీ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి.. చెన్నైకి వెళ్తున్నారు.;
కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా యావత్ దక్షిణ భారతదేశం ఏకమవుతోంది. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యాక్టివ్ రోల్ పోషిస్తు్న్నారు. మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయా పార్టీల నాయకులతో శనివారం చెన్నై వేదికగా జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడం కోసం తెలంగాణ కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డి.. చెన్నైకి బయలుదేరారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. డీఎంకే మిత్రపక్షంగా వ్యవహిరిస్తోందా? లేకుండా డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా స్వరం వినిపించడానికి చెన్నై వెళ్తుందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే, కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నారు. అందువల్లే ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎంనే ఎంపాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర వ్యతిరేక స్వరం వినిపించారు. కేంద్రం తీసుకొచ్చిన కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసినందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఇప్పుడు కొరడా ఝులిపించే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు రేవంత్. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేపట్టే పనయితే దానిని మరో 30 ఏళ్లు వాయిదా వేయాలన్నారు. ఈ క్రమంలో చెన్నైలో నిర్వహించే జేఏసీకి హాజరై.. డీలిమిటేషన్ వల్ల తెలంగాణ ప్రజలకు జరిగే నష్టాన్ని తెలపాలని, డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని డీఎంకే నేతలు రేవంత్‌ను ఢిల్లీలో కలిసి ఆహ్వానం అందించారు. వారి ఆహ్వానం మేరకే రేవంత్.. శనివారం జరిగే జేఏసీ సమావేశంలో పాల్గొననున్నారు.