తెలుగు ఐపిఎస్ అధికారి ఆత్మహత్యపై స్పందించిన రేవంత్ రెడ్డి
అడిషనల్ డిజిపి స్థాయి వ్యక్తికే ఈ పరిస్థితి ఉందంటే సామాన్య వ్యక్తి పరిస్థితి...
తెలుగు వ్యక్తి అయిన హర్యానా కేడర్ ఐపిఎస్ అధికారి, అడిషనల్ డిజిపి పూరన్ కుమార్ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అడిషనల్ డిజిపి స్థాయి అధికారిని కులం పేరుతో దూషించడం హేయమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. కుల వివక్ష కారణంగా ఈ అధికారి ఆత్మహత్య ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు. ఒక డిజిపి స్థాయి అధికారి పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య వ్యక్తి పరిస్థితిని ఊహించుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
సమాజంలో అసమానతల వల్ల ప్రజలకు రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే అవకాశముందన్నారు.
పూరన్ కుమార్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలతో బాటు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఆత్మహత్య చేసుకున్న పూరన్ కుమార్ తన మరణ వాంగ్మూలంలో రోహ్తక్ జిల్లా ఎస్ పి నరేంద్ర బిజర్నియాపై ఆరోపణలు చేశారు. వాంగ్మూలంలో ఆయన పేరు ఉంది. బిజర్నియాను పదవి నుంచి బదిలీ చేస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.