వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో దర్శనాల నిలిపివేత

విస్తరణ పనులు ప్రారంభం కావడంతో ఆలయ ఈవో నిర్ణయం

Update: 2025-10-12 10:05 GMT

వేముల వాడ ఆలయంలో దర్శనాలు నిలిపి వేసారు. ఆదివారం దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరో వైపు ఆర్జిత సేవలను భీమన్న ఆలయానికి మారుస్తూ ఆలయ ఈవో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయఅభివృద్ది, విస్తరణ నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి వారికి సమర్పించే అన్నిరకాల ఆర్జిత సేవలు, చెల్లించుకునే కోడెమొక్కులు, నిర్వహించే చండీహోమం, నిత్య కళ్యాణం, అన్న పూజ, అభిషేకాల కోసం ఇదే ఆలయానికి రావాలి. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి నిర్వహించే  ఏకాంత సేవలో భక్తులు యధావిధిగా పాల్గొనవచ్చు. తెలంగాణలో ప్రముఖ  పుణ్యక్షేత్రాలలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఒకటి.

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసిన బిజెపి

రాజన్న దేవాలయంలో దర్శనాల నిలిపివేత కొన్ని నెలల పాటు కొనసాగే  అవకాశముంది.

ఈ సమాచారం భక్తుల నుంచి అందుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులకు ఫోన్ చేసి దర్శనాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా రాజన్న దేవాలయంలో దర్శనాలను నిలిపివేయడం పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఉన్న ఫళంగా దర్శనాలను నిలిపివేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. దర్శనాలు నిలిపివేయడంతో రాజకీయంగా వివాదం ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బిజెపి శ్రేణులు దగ్దం చేశాయి. దర్శనాల నిలిపివేయడం వల్ల అధికార పార్టీని నిందించడానికి ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది.

Tags:    

Similar News