ఎస్ఆర్ఎస్పి కి దామోదర్ రెడ్డి పేరు

రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి

Update: 2025-10-12 11:07 GMT

ఎస్ఆర్ఎస్ పి స్టేజ్ 2కు ఇకపై ఆర్డీఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు.24 గంటల్లో జీవో జారి చేస్తామని ఆయన హామి ఇచ్చారు. దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభ సూర్యపేట తుంగతుర్తిలో జరిగింది.  దామోదర్ రెడ్డి చిత్రపటానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాలను రప్పించడానికి ఎస్ ఆర్ ఎస్ పి స్టేజ్ 2 సాధించడంలో దామోదర్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారన్నారు. గత ప్రభుత్వంపై పోరాడి ఈ ప్రాజెక్టు ఆయన తీసుకొచ్చారన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి తన ఆస్తులను నల్లొండ జిల్లా ప్రజలకు దారాదత్తం చేశారన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గాంధీ కుటుంబం దామోదర్ రెడ్డి కుటుంబానికి చేయూతనిస్తుందని రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు.

Tags:    

Similar News