రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి
యువకులు ఇద్దరు బైకుపైనుండి ఎగిరి రోడ్డుపైన పడ్డారు. పడటం పడటమే వాళ్ళ తలలు రోడ్డుకు బలంగా కొట్టుకున్నాయి
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోయారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం వేగంగా వెళుతున్న బైకును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆప్రమాదంలో యువకులు ఇద్దరు బైకుపైనుండి ఎగిరి రోడ్డుపైన పడ్డారు. పడటం పడటమే వాళ్ళ తలలు రోడ్డుకు బలంగా కొట్టుకున్నాయి. దాంతో తలపై తీవ్రగాయాలవ్వటంతో యువకులు ఇద్దరు ప్రమాదస్ధలంలో మరణించారు. స్ధానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నారు. యువకుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టమ్ చేయించారు. యువకుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటపుడు కచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాలని పోలీసులు ఎంతగా చెబుతున్నా మోటారుసైకిల్ నడిపేవారిలో కొందరు హెల్మెట్లు పెట్టుకోవటంలేదు. కార్లు నడిపేటపుడు సీటు బెల్టులు పెట్టుకోవాలని పోలీసులు ఎంతచెబుతున్నా చాలామంది పట్టించుకోవటంలేదు.