‘కేటీఆర్ ఒక డ్రగ్ బ్యాచ్’
ఆయన స్నేహితుడు కూడా డ్రగ్స్ తీసుకునే మరణించాడు.;
మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఒక డ్రగ్స్ బ్యాచ్ అంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక దగా పార్టీ అని, అందుకే ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసిన గెలిచాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాము అలా కాదని, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయమని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు తాము ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోమని అన్నారు. తాను ఢిల్లీకి వెళ్తుంటే కొందరు గుండెలు తరుక్కు పోతున్నాయని, అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే వెళ్తున్నానని వివరించారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలంటే ఢిల్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్‌కు వెళ్లాలా అంటూ సెటైర్లు వేశారు.
కేటీఆర్ స్నేహితుడు కేదార్.. దుమాయ్‌లో డ్రగ్స్ తీసుకుని మరణించారని సీఎం రేవంత్ అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌లను తెలంగాణకు తెప్పించామని కూడా తెలిపారు. కేటీఆర్ గంజాయి బ్యాచ్, ఆయన చుట్టూ ఉండేటోళ్లందరూ డ్రగ్స్ తీసుకుంటుంటారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్. డ్రగ్స్ అంశంపై మాట్లాడకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు.