షిరిడీను దర్శించుకున్నముఖ్యమంత్రి సతీమణి
బాబాను దర్శించుకోవడం ఇదే మొదటిసారి;
By : B Srinivasa Chary
Update: 2025-07-02 14:57 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి బుధవారం శిరిడీలోని సాయి బాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. సాధారణంగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే సమయంలో ఆమె భర్తతో కలిసి సందర్శిస్తుంటారు. ముఖ్యమంత్రి బిజీగా ఉండడం వల్ల ఆమె ఒంటరిగా షిరిడీ చేరుకున్నారు. తాను షిరిడీకి రావడం ఇదే మొదటి సారి అని గీతారెడ్డి చెప్పారు. షిరిడీతో బాటు ద్వారకామయి, గురుస్థాన్ ఆలయాలను దర్శించుకున్నట్టు ఆమె చెప్పారు. సాయిబాబా సంస్థాన్ తరపున సీఈవో గడిల్కర్ ఆమెకు తీర్థ ప్రసాదాలను అంద జేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి భార్య షిరిడీ రావడంతో అక్కడి అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.