రోహిత్ చట్టంపై స్పందించిన రేవంత్..
గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు మరియు భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్న రేవంత్.;
దేశంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకుంటున్నా ఇప్టటికి కూడా భారతదేశ విద్యారంగంలో కుల వివక్ష అనేది వేళ్లూనుకునే ఉందని కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యానించారు. ఇందుకోసం ‘రోహిత్ వేముల’ చట్టం తీసుకురావాలని కూడా రాహుల్ కోరారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాశారు. దళిత, గిరిజిన, వెనకబడిన వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షను కూకటి వేళ్లతో పెకలించాలని, అందుకోసం ‘రోహిత్ వేముల’ చట్టం తీసుకురావాలని రాహుల్ కోరారు. కాగా రాహుల్ రాసిన లేఖపై తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న రేవంత్.. రాహుల్ రాసిన లేఖను చదివినట్లు చెప్పారు. అంతేకాకుండా ఆయన ఆశయాలు, భావాలతో ముందుకు వెళ్తామని చెప్పారు.
‘‘జపాన్‌లోని హిరోషిమా చారిత్రక నగరంలో నేను మీ లేఖను చదివాను. అదృష్టవశాత్తూ, నేను ఇక్కడ మహాత్మా గాంధీజీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడు మీ లేఖ చదివాను. మీ స్ఫూర్తిదాయకమైన పిలుపు నాకు బలంగా తాకింది. గర్వించదగిన భవిష్యత్తును రూపొందించడంలో మీ ఆలోచనలు, భావాల స్ఫూర్తితో ముందుకు వెళ్తాము’’ అని చెప్పారు. కాగా తాజాగా ఇదే అంశంపై రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుక్కుకు కూడా లేఖ రాశారు.