ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ భారీ ట్విస్ట్..

Update: 2025-07-28 10:54 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ ట్విస్ట్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు ఆర్ఎస్ ప్రవీణ్ సోమవారం హాజరయ్యారు. బాధితుడిగా విచారణకు హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్‌కు సీఎం రేవంత్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. డార్ట్ వెబ్ సహాయంలో సీఎం రేవంత్.. ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన అన్నారు. విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా ఒక సాక్షిగా ఈరోజు విచారణకు వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేరస్తోందని ఫిర్యాదు చేశాను’’ అని తెలిపారు.

Full View

‘‘డార్క్ వెబ్‌ల సహాయంతో మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారు. ఇదే విషయంపై సిట్‌కు ఫిర్యాదు చేశాను. గతంలో నేను బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశానని అంటున్నారు. ఆ సమయంలో నా ఫోన్ హ్యాక్ అయినట్లు యాపిల్ సంస్థ నుంచి మెసేజ్ వచ్చింది. దానికి సంబంధించే కమిషనర్‌కు అప్పట్లో ఫిర్యాదు చేశాను. బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది’’ అని ఆర్ఎస్‌పీ పేర్కొన్నారు.

Tags:    

Similar News