దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలన్న రేవంత్

బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని రేవంత్ ఎందుకు డిమాండ్ చేశారో అర్ధంకావటంలేదు.;

Update: 2025-07-23 14:03 GMT
Revanth and Bandaru Dattatreya

ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన డిమాండ్ చేశారు. అదేమిటంటే బీజేపీ సీనియర్ నేత, హర్యాన రాష్ట్రగవర్నర్ బండారుదత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలన్నారు. దత్తన్న(Bandaru Dattatreya)కు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయంచేసినట్లు అవుతుందన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్(BC Reservations) బిల్లును కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బలహీనవర్గాలకు న్యాయంచేసినట్లు అవుతుందని నరేంద్రమోదీ(Narendra Modi)కి రేవంత్ (Revanth) సూచించారు.

బీసీలకు న్యాయంచేయాలన్న ఉద్దేశ్యంతోనే తెలంగాణలో కులగణన చేసినట్లు చెప్పారు. బీసీ కులగణనతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈసర్వే ద్వారా రాష్ట్రంలోని 3.5 కోట్లమంది వివరాలను సేకరించినట్లు చెప్పారు. గడచిన వందేళ్ళుగా వాయిదాపడుతున్న కులగణనను తమ ప్రభుత్వం నెలరోజుల్లోనే పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. అసెంబ్లీలో రెండు తీర్మానాలుచేసి పార్లమెంటుకు పంపినట్లు తెలిపారు. స్ధానికఎన్నికల్లో బీసీలకోసం చేసిన బిల్లులను కేంద్రం జాప్యంచేస్తున్నట్లు రేవంత్ మండిపడ్డారు. బీసీ బిల్లులు, కులగణన తదితరాలపై తాను ఇండియా కూటమిలోని ఎంపీలు, సీనియర్ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. కేంద్రం మెడలు వంచయినా సరే బీసీ రిజర్వేషన్లను సాధిస్తామని ప్రకటించారు.

ఇదంతా బాగానే ఉందికాని దత్తన్నగా పాపులరైన బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని రేవంత్ ఎందుకు డిమాండ్ చేశారో అర్ధంకావటంలేదు. బీజేపీ సీనియర్ నేత పేరును ఉపరాష్ట్రపతిగా రేవంత్ ఎందుకు సూచించారు అన్నది ఆసక్తిగా మారింది. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్ కడ్ సడెన్ గా రాజీనామాచేసిన విషయం తెలిసిందే. కొత్త ఉపరాష్ట్రపతిని ఎంచుకునే విషయంలో నోటిఫికేషన్ కూడా జారీఅయ్యింది. దాంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయంగా చాలా పేర్లు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రేవంత్ సడెన్ గా దత్తన్న పేరును ప్రతిపాదించటం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News