ఎస్సీ వర్గీకరణకు రేవంత్ డెడ్ లైన్
ఎస్సీ వర్గీకరణ అంశంలో వన్ మ్యాన్ కమిషన్ 60 రోజుల్లో రిపోర్టు అందించాలని రేవంత్ ఆదేశించారు.
By : The Federal
Update: 2024-10-09 09:30 GMT
తెలంగాణా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ వర్గీకరణ అంశంలో వన్ మ్యాన్ కమిషన్ 60 రోజుల్లో రిపోర్టు అందించాలని రేవంత్ ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యతల కోసం వన్ మ్యాన్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ జరగాలని రేవంత్ చెప్పారు. కమిషన్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా 24 గంటల్లో అవసరమైన ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. వర్గీకరణపై సవివరమైన రిపోర్టు వచ్చిన తర్వాతే ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ చెప్పారు. గడువులోగా కమిషన్ వర్గీకరణ రిపోర్టును ఇవ్వాలని సీఎం గట్టిగా చెప్పారు.