Road Accident | లారీని ఢీకొన్న బస్సు, నలుగురి మృతి, 17మందికి గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ -ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.;

Update: 2025-01-10 01:49 GMT

హైదరాబాద్- ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ దుర్గటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.

- సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ ఆగి ఉంది. కూలీ పనుల కోసం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి గుప్తా ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
- ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే సూర్యాపేట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. గాయపడిన వారిని సమీపంలోని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- ప్రమాదం సమయంలో బస్సులో 32 మంది కూలీలున్నారని పోలీసులు చెప్పారు.అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. పోలీసులు, స్థానికులు రోడ్డుపై ప్రమాదానికి గురైన లారీ, బస్సు శిథిలాలను క్రేన్ల సహాయంతో తొలగించే పనిలో ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News