ఆందోళన బాట పట్టిన సచివాలయ ఉద్యోగులు
పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్;
తెలంగాణ సచివాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం సరికాదని అన్నారు. సీపీఎస్ (CPS)విధానం రద్దు చేసి గతంలో మాదిరి భద్రతతో కూడిన 1980 పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2014 ఆగస్టు 23 తేదీన తెలంగాణ ఆవిర్భావం తరువాత జీవో తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జీవోను అమలు చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 100 రోజులలో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి పాత పెన్షన్ విధానం తీసుకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సాధారణ ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది ఆసరా పెన్షన్ పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వంటి వారికి నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది.