శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన అధికారులు.

Update: 2025-09-28 07:39 GMT

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం మొత్తాన్ని అధికారులు జల్లెడపట్టడం ప్రారంభించారు. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులను కూడా అప్రమత్తం చేశారు. ఎవరి ప్రవర్తన అయినా అనుమానాస్పదంగా అనిపిస్తే తమకు సమాచారం అందించాలని ప్రయానికులను కోరారు అధికారులు. ప్రయాణికులు ఎటువంటి ఆందోళనకు గురికావొద్దని చెప్పారు. ప్రస్తుతం విమానాలు సహా విమానాశ్రయం మొత్తాన్ని భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.

మరోవైపు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పేరుపైన వచ్చింది? వంటి కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కొంతకాలంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య విమానాశ్రయాలకు మెయిల్స్ రూపంలో బెదిరింపులు వస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు కూడా ఇటువంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు తరచూ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్న అంశంపై ఫోకస్ పెట్టారు. దాంతో పాటుగానే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News