సిగాచి పేలుడు భద్రతా వైఫల్యానికి ప‌రాకాష్ట!

భారీ పేలుడుకు కారణమిదేనా?;

Update: 2025-07-02 12:34 GMT

సిగాచీ కంపెనీలో పేలుడుకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రసాయన పదార్థాల్లో తేమ తొలగించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఆ ప్రక్రియలో గాలి పీడనంలో మార్పుల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కొందరు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం ఎంత పెద్దది అంటే, ఆ ధాటికి రసాయనం శుద్ధి చేసే ప్లాంట్ భవనం కుప్ప కూలింది. దానిపై ఉండే రేకులు గాలిలో ఎగిరి ఫ్యాక్టరీ బయట ఉన్న చెట్లపై పడ్డాయి.పేలుడు ప్రదేశానికి పక్కన ఉన్న ఇతర భవనాలు దెబ్బతిన్నాయి.  హైదరాబాద్‌తోపాటు పొరుగున ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి తదితర జిల్లాల్లోనే ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమయ్యాయి. రసాయనాలు, ఫార్మా పరిశ్రమలు హైరిస్క్‌ క్యాటగిరీలో ఉండగా, వీటిపై పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. కర్మాగారాలను పర్యవేక్షించాల్సిన డైరెక్టరేట్‌ కార్యాలయంలో తనిఖీలు చేసేందుకు కనీసం 100 మంది ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే పనిస్తున్నారు. 

వాణిజ్యం, పరిశ్రమల శాఖ పరిశ్రమలకు అనుమతులు ఇస్తుంటే, కార్మికశాఖ పరిధిలోని డైరేక్టరేట్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌-బాయిలర్స్‌ విభాగం కర్మాగారాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది. కాలుష్య అంశాలను పర్యావరణం, అటవీశాఖ పరిధిలోని కాలుష్య నియంత్రణ మండలి చూస్తుండగా, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు కార్మికశాఖ పరిధిలో ఉన్నాయి. పరిశ్రమల శాఖ పరిధిలోని ఐలా (ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) కేవలం పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాలపైనే దృష్టి పెడతాయి తప్ప కర్మాగారాల్లోని పరిస్థితులపై దృష్టి పెట్టడంలేదు. ఈ నాలుగు అంశాలు వేర్వేరు శాఖల పరిధిలో ఉండగా, వీటి మధ్య ఎటువంటి సమన్వయం లేకుండా పోయింది. ఏనాడూ ఈ శాఖల మధ్య సమన్వయ సమావేశాలు కూడా జరిగిన దాఖలాలు లేవు. దీనికితోడు ఆయా శాఖలను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌పై మాజీ ఐఎఎస్ చంద్ర‌వ‌ద‌న్ తో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ.....


Full View


Tags:    

Similar News