Balagam Mogilaiah|‘బలగం’ మొగిలయ్య మృతి
బలగం సినిమాలో పాడిన పాటతో మొగిలయ్య తెలుగురాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు.
ఈమధ్యనే వచ్చిన బలగం సినిమా ద్వారా బాగా పాపులరైన సింగర్ మొగిలయ్య మరణించాడు. గురువారం తెల్లవారుజామున వరంగల్ ఆసుపత్రి(Warangal Hospital)లో మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న మొగిలయ్య(Singer Mogilaiah) రెండు కిడ్నీలు(Kidney Problem) పాడైపోయాయి. దాంతో కొంతకాలంగా డయాలసిస్ మీదే నెట్టుకొస్తున్నారు. ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయించుకుంటున్న మొగిలయ్య అనారోగ్యం బాగా క్షీణించటంతో చివరి శ్వాస వదిలేశారు. బలగం సినిమాలో పాడిన పాటతో మొగిలయ్య తెలుగురాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. మొగిలయ్యది వరంగల్ జిల్లాలోని దుగ్గొండి గ్రామం.
తెలంగాణా గ్రామీణ నేపధ్యంలో కమెడియన్ వేణు దర్శకత్వంలో బలగం సినిమా రూపొందింది. ఆ సినిమాలో క్షీణించిపోతున్న మానవసంబంధాలను చాలా హృద్యంగా చూపించారు. ఉరుకుల, పరుగుల జీవితంలో మరచిపోతున్న మానవసంబంధాలను వేణు ఎత్తిచూపించారు. ఈ సినిమాలో ‘తోడుగా మాతోడుండి నీడగా మాతో నడిచి..నువ్వెక్కడికెళ్ళినవావు కొమురయ్యా’ అనే పాట చాల పాపులరైంది. ఎంతో హృద్యంగా సాగిపోయే ఆ పాట చాలమందిని కదిలించటంతో సింగర్ గా మొగిలయ్యకు బాగా గుర్తింపొచ్చింది. కరోనా వైరస్(Corona virus) బారిన పడిన మొగిలయ్య అప్పటినుండి ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతునే ఉన్నాడు. ఈ నేపధ్యంలోనే కొంతకాలం క్రితం రెండు కిడ్నీలు చెడిపోయాయి.
మొగిలయ్య అనారోగ్యం గురించి తెలుసుకున్న అప్పటి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కూడా బాగానే సాయం చేసింది. ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నీ సంక్షేమపథకాలను మొగిలయ్యకు అందుతున్నాయి. అప్పుడు, ఇపుడు కూడా మొగిలయ్య చికిత్సపై ప్రభుత్వం ప్రత్యక శ్రద్ధ తీసుకున్నది. అయినా ఆరోగ్యం క్షీణించటంతో మృత్యువుతో పోరాడలేక మొగిలయ్య ఓడిపోయారు. మొగిలయ్య మరణ వార్త వినగానే సినీరంగంలోని ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా సంతపం తెలిపారు.