ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, సైన్యం సహకారం తీసుకుంటాం : మంత్రి ఉత్తమ్

ఎస్ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న 8మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు.;

Update: 2025-02-22 15:23 GMT

నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8మందిని సురకితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల సహాయ చర్యలు ముమ్మరం చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.భారత సైన్యం సహకారం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.అగ్నిమాపక,విపత్తు నిర్వహణ డీజీ ఆధ్వర్యంలో రిస్క్యూ టీంలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుందని మంత్రి చెప్పారు.


వైద్యసిబ్బందిని ఉంచాం...
సంఘటన స్థలంలో అవసరమైన వైద్య సేవల కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటికే సింగరేణి కి చెందిన రిస్క్యూ టీం లు రంగంలోకి దిగాయని ,భారత ఆర్మీ కి చెందిన రిస్క్యూ టీం లతో తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడామని ఈ రాత్రి వరకు ఆ టీం ఇక్కడికి చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు టన్నెల్ వద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు రంగంలోకి దిగి కాపాడే టీంలతో కుడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...
టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం అకస్మాత్తుగా లోపటికి నీరు,మట్టి రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోజువారీగా పని మొదలు పెట్టినట్లే శనివారం ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాలలోనే ఈ సంఘటన జరిగింది. వెంటనే నిర్వాహకులు పనిని నిలిపి వేసి బయటకు రావడంతో పాటు వీలున్నంత వరకు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. టన్నెల్ బోర్ మిషన్ టీబీఎం వద్ద పని మొదలు పెట్టారో అక్కడికి నీరు,మట్టి చేరుతుండడంతో పాటు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మిషన్ మీద ఉన్న వారు,వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాగలిగారని మంత్రి పేర్కొన్నారు. మిషన్ ముందు భాగంలో ఉన్న వారు అందులో చిక్కుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఉత్తరాఖండ్ టీంను రంగంలో దింపుతున్నాం...
ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు రంగంలోకి దిగి ప్రాణాపాయం లేకుండా కాపాడిన టీం ను కుడా రంగంలోకి దింప నున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో పాటు ఉన్నత స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. టన్నెల్ లో వెంటిలేషన్ కు ఇబ్బంది లేదని, టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్నదన్నారులోపట చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడడమే ప్రభుత్వం ముందున్న సవాల్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు


Tags:    

Similar News