యాదగిరిగుట్టలో అందాల భామల ప్రత్యేక పూజలు
తెలంగాణలోని యాదగిరిగుట్ట, పోచంపల్లి ప్రాంతాల్లో ప్రపంచ సుందరీమణులు గురువారం పర్యటించారు. అందాల భామల ఫోటో షూట్ కార్యక్రమం ఆకట్టుకుంది.;
యాదగిరిగుట్ట శ్రీ నరసింహ స్వామి ఆలయంలో ప్రపంచ అందాల భామలు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా మిస్ వరల్డ్ 2025 పోటీదారులు తెలంగాణ లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయానికి కరేబియన్ గ్రూప్ కు చెందిన 9 దేశాల ప్రపంచ సుందరీమణులు వచ్చారు.
కోలాటాలు, సాంప్రదాయ భజన, శాస్త్రీయ నృత్యాల మధ్య తూర్పురాజగోపురం వద్దకు చేరుకున్న సుందరీమణులు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. డా రామూన్ , షుబ్రెయిన్ డ్యామ్స్ ,మైరా డెల్గాడో ,నోయెమీ మిల్నే ,క్రిస్టీ గైరాండ్ ,తహ్జే బెన్నెట్ ,ఆరేలీ జోచిమ్, వలేరియా పెరెజ్ , అన్నా-లిస్ నాంటన్ లు దేవాలయాన్ని సందర్శించారు.
అందాల భామలకు వేదపండితుల ఆశీర్వాదం
అందాలభామలకు పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి నరసింహ స్వామి మెమోంటోలు అందజేశారు..అనంతరం ఆలయ అంతర్ మాడ వీధులను సుందరీమణులు తిలకించారు.
పోచంపల్లి నేత చీరల అందాలు చూసి...