బంజారాహిల్స్ లో కారు బీభత్సం (వీడియో)

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫార్చునర్ కారు అతి వేగంగా దూసుకొచ్చింది.

Update: 2024-08-31 07:16 GMT

హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫార్చునర్ కారు అతి వేగంగా దూసుకొచ్చింది. లుంబిని కమర్షియల్ కాంప్లెక్స్ ఫుడ్ పాత్ పైకి ఎక్కింది. పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఆటోను, కారును ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారును మైనర్ నడిపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 120 పైన స్పీడ్ తో దూసుకొచ్చినట్లు తెలిపారు. అందుకే కారు కంట్రోల్ అదుపుతప్పి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఒక ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమచారం తెలియాల్సి ఉంది.

ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్ కి గాయాలైనట్టు తెలుస్తోంది. చికిత్స కోసం అతనిని ఆసుపత్రికి తరలించారు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాధమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనే దానిపై ఇంకా వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఘటనపై సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News