తెలంగాణలో పేదల ‘బల్బ్’ వెలిగింది

"సారూ.. ఇంట్ల ఒకటే బుగ్గ ఉంది. పంక, గింక లు లెవ్వు. టీవీ లేదు. చీకటి అయితేనే బుగ్గేస్తా.. పొద్దుగాల్లనే బంజేస్తా.. ముసల్ దాన్ని కొంచె చూసి బిల్లు కొట్టు"

Update: 2024-03-01 12:52 GMT

తెలంగాణ పల్లెల్లో కరెంట్ బిల్లులు తీసి ఇచ్చే గ్రామీణుల నోట్లో నుంచి వచ్చే మాట. అయితే ఇక ముందు ఇలాంటి మాటలు కనుమరుగు కానున్నాయి. నేను తక్కువ కరెంట్ వాడిన, ఎక్కువ బిల్లు కొట్టినవంటూ జరిగే తమాషా గొడవలు సైతం ఇక ముందు కనిపించవు.. బిల్లు కట్టకపోతే బలవంతగా వచ్చి కరెంట్ కనెక్షన్ కట్.. వంటివి అసలే కనిపించవు. ఎందుకంటే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 200 యూనిట్ల లోపు వాడిన ప్రజలకు గృహ జ్యోతి కింది జీరో బిల్లులను జారీ చేయనుంది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గృహాజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన అర్హులకు జీరో విద్యుత్ బిల్లుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రుల అధికారులు ఫిబ్రవరి 27 న ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి మాసంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన వారికి ఈ మార్చి మాసంలో జీరో వస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం తన మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో ఇద్దరు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి జీరో బిల్ తీసి గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు సిఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రము లో ని దాదాపు 39.9 లక్షల వినియోగదారులు ఈ ఉచిత పథకానికి అర్హులుగా నిర్ణయించారు. వీరిలో సొంత గృహం వున్నవాళ్లు మరియు అద్దెదారులు కూడా వున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ పంపిణి సంస్థల అన్ని విభాగాల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారు.
మొదటి సారి జీరో బిల్లులు అందుకున్న వినియోగదారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు ఎంతో హుషారుగా బిల్లుల జారీ ప్రక్రియ లో పాల్గొంటున్నారు.
అర్హత కలిగి ఉండి ఈ పధకం లో లబ్ది పొందలేని వినియోగదారులు ఎవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఇదొక నిరంతర ప్రక్రియ. గృహజ్యోతి పథక లబ్ది కోసం అవసరమైన ఆహార భద్రతా కార్డు, ఆధార్ కార్డు మరియు విద్యుత్ బిల్లును మండల పరిషత్ కార్యాలయంలో గాని/ మునిసిపల్ కార్యాలయంలో గాని/ GHMC సర్కిల్ కార్యాలయాల్లో తమ వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించారు.
అర్హతలున్న వినియోగదారుల దరఖాస్తులను ద్రువీకరించుకునే అవకాశం కల్పించినందున, వారి నుంచి బిల్లుల వసూలుకు ఎలాంటి బలవంతపు చర్యలు వుండవు. గృహ జ్యోతి పథకం ఒక నిరంతర ప్రక్రియ. ఆహార భద్రతా కార్డు వున్న ప్రతి ఒక్క వినియోగదారుడికి 200 లోపు ఉచిత విద్యుత్ సరఫరా అందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం మరియు ఆశయం. అద్దెకు వుండే వారికి కూడా నిస్సందేహంగా ఈ పధకం వర్తిస్తుంది.


Tags:    

Similar News