చెన్నూరు ఎస్ బిఐ చోరీ కేసులో కీలక పరిణామం

12.60 కోట్ల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం;

Update: 2025-09-12 11:57 GMT

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎస్బీఐ-2 బ్రాంచ్​లో గత నెలలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ వ్యవహారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అపహరణకు గురైన ఆభరణాలను పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన న రవీందర్ ను పోలీసు కస్టడీ తీసుకున్నప్పుడు కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించడంతో నిందితులైన 43 మందిని అరెస్ట్ చేసినట్టు శుక్రవారం మంచిర్యాల డిసిపి భాస్కర్ వెల్లడించారు.

అపహరణకు గురైన రూ.12.60 కోట్లు విలువ చేసే 20.487 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి చెప్పారు. కేసు వివరాలను జైపూర్ పోలీస్ స్టేషన్లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు.గత నెల 21వ తేదీన చెన్నూర్ ఎస్బిఐ బ్రాంచ్ లో అడిట్ జరిగింది. బ్యాంకులో బంగారం , నగదు నిల్వల్లో తేడా కనిపించడంతో మేనేజర్ నితీష్ కుమార్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల దర్యాప్తులో బ్యాంక్ క్యాషియర్ నరిగె రవిందర్ ప్రధాన నిందితుడు అని గుర్తించి అరెస్ట్ చేశారు. బంగారాన్ని ప్రయివేటు రుణ సంస్థల్లో కుదువ పెట్టి భారీ స్కామ్ జరిగినట్టు గుర్తించారు.

నిందితులు నరిగె రవీందర్, కొంగడి బీరేశ్, కోదాటి రాజశేఖర్లను కస్టడీకి తీసుకుని లోతుగా విచారిస్తే పై విషయాలు వెల్లడయ్యాయి. తాకట్టు పెట్టిన బంగారం, నగదును స్వాధీనం చేసుకుని నిందితులందరిని అరెస్ట్ చేసినట్టు డిసిపి చెప్పారు.

Tags:    

Similar News