పట్టపగలే శంకర్ పల్లిలో దారి దోపిడి

40 లక్షలతో ఉడాయించిన దుండగులు;

Update: 2025-09-12 11:06 GMT

స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షలతో ఉండాయించారు. ఈ ఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుండగులు తొలుత స్టీల్ వ్యాపారి కారును ఆపి కత్తులతో బెదిరించారు. డబ్బు ఉన్న బ్యాగును తీసుకుని పారిపోతుండగా.. అదుపుతప్పి వారి వాహనం పల్టీ కొట్టింది. దీంతో దుండగులు వాహనాన్ని అక్కడే వదిలేసి.. డబ్బు బ్యాగును తీసుకొని పారారయ్యారు. దుండగుల వాహనం పల్టీ కొట్టిన సమయంలో రూ.15 లక్షల రూపాయలు కారులోనే వదిలేసి వెళ్లిపోయారు. సైబరాబాద్‌ పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు.అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.




Tags:    

Similar News