మళ్ళీ బర్డ్ ఫ్లూ... ఆరోగ్యశాఖ అలర్ట్

కొన్నేళ్ల క్రితం ప్రబలిన బర్డ్ ఫ్లూ కేసులు మళ్ళీ నమోదవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

Update: 2024-06-08 12:04 GMT
Photo Credits : Twitter

నిన్న మొన్నటి వరకు కోవిడ్ వైరస్ వేరియంట్లతో భయపడిపోయిన ప్రజలని మరో మహమ్మారి కలవరపెడుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రబలిన బర్డ్ ఫ్లూ కేసులు మళ్ళీ నమోదవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్‌పూర్), కేరళ (అలప్పుజా, కొట్టాయం, పతనంతిట్ట), జార్ఖండ్ (రాంచీ) రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ (H5N1) వ్యాప్తి చెందడంతో, తెలంగాణ ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఫ్లూ వ్యాధి నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధికి ప్రధాన కారణం పక్షిజాతి జంతువులు. వీటిలో అధికంగా కోళ్లు, బాతులు, కొన్నిరకాల పక్షులు ఉన్నాయి. ఇవి సాధారణంగా పెద్ద సంఖ్యలో ఆనారోగ్య సమస్యలకు గురి చేస్తాయి. ఒకరికి సోకితే ఆ వ్యాధి వ్యాప్తి అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా పెరటి పక్షులు, పావురాలు ఇలా ఇతర జాతులతో సహా, మానవులు పెంచుకునే కొన్ని రకాల అటవీజాతి పక్షుల కారణంగా కూడా వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఇంట్లో పెంచుకునే పక్షులే కాకుండా లైవ్ బర్డ్ మార్కెట్లు, కోళ్ల ఫారమ్ లద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పక్షుల జాతి నుంచి కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొలాలలో పౌల్ట్రీని నిర్వహించే వ్యక్తులు, అలాగే పౌల్ట్రీ కీపర్లు, పక్షులు ఉండే పరిసరాలకు దగ్గరగా ఉండే వారు, తరచుగా ఆ ప్రాంతాల్లో సంచరించడం వలన అధిక ప్రమాదం సంభవిచే ఛాన్స్ ఉంటుంది.

బర్డ్ ఫ్లూ లక్షణాలు:

తరచూ తీవ్ర జ్వరం

దగ్గు

శ్వాస సమస్యలు

కండరాల నొప్పులు

వైరస్ నిరోధించడానికి సూచనలు..

వ్యాధి సోకిన లేదా అనుమానిత పక్షులు, జంతువులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం.

అలాంటి లక్షణాలు ఉన్న జంతువులు, వ్యక్తులకు దూరంగా ఉండటం.

చికెన్, గుడ్లు లాంటివి పచ్చిగా లేదా తక్కువగా ఉడికించిన వాటిని తినకపోవడం.

ముఖ్యంగా పౌల్ట్రీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం. ఒకవేళ తినాలనిపిస్తే అందులోని వైరస్‎ను చంపడానికి 70°C వరకు ఉడికించాలి.

పౌల్ట్రీ గుడ్లను తాకిన తర్వాత చేతులు బాగా సబ్బుతో కడగాలి.

చేతులు శుభ్రంగా కడగకుండా శరీరంలోని వివిధ భాగాలకు, చర్మానికి తాకకుండా జాగ్రత్తలు వహించాలి.

శానిటైజర్ వాడకం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.

అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నవారి బట్టలు, పాత్రలు, ఇతర వస్తువుల తాకడం మానుకోవాలి.

Tags:    

Similar News