లిక్కర్ షాప్‌ల టెండర్లకు వేళాయే..

నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

Update: 2025-09-25 09:50 GMT

తెలంగాణలో కొత్త ఏ4 లిక్కర్ షాప్‌ల లైసెన్స్ టెండర్లు పిలవడానికి ప్రభుత్వం రెడీ అయింది. టెండర్ల తేదీలను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్దతిలో దుకాణాల కేటాయింపు చేపట్టనున్నారు. ఆ తర్వాత లాటరీలో టెండర్ గెలుచుకున్న వ్యక్తికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. అన్ని అనుమతులతో లైసెన్స్‌లను జారీ చేస్తుంది. అంటే ఈ టెండర్లలో గెలిచిన వ్యక్తి లైసెన్స్‌ 1 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027 వరకు వ్యాలిడ్ అవుతుంది.

అయితే ఈసారి మద్యం దుకాణాల దరఖాస్తు రుసుమును ప్రభుత్వం భారీగా పెంచింది. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు కట్టాల్సిగా ప్రకటించింది. టెండర్ సక్సెస్ అయినా కాకపోయినా, లైసెన్స్ వచ్చినా రాకపోయినా.. ఈ దరఖాస్తు రుసుము అయితే కట్టి తీరాల్సిందే. దీంతో ఈ ఏడాది మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. అయితే మద్యం దుకాణాలు ఎవరికి కేటాయించాలి అన్న అంశంపై కూడా ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎక్సైజ్ శాఖ 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి వాటిని సరిగా చెల్లించని వారు దుకాణాలు పొందడానికి అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గం వారికి 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది సర్కార్.

Tags:    

Similar News