'గేమ్ చేంజర్' టికెట్ల రేట్ల పెంపు మీద రేవంత్ కు హైకోర్టు చివాట్లు

ఈ ఉత్తర్వులను 24గంటల్లో పున:పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనే;

Update: 2025-01-11 02:04 GMT

రామ్‌చరణ్‌ నటించిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా స్క్రీనింగ్‌కు టిక్కెట్ల ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని 24 గంటల్లోగా సమీక్షించాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం (జనవరి 10) మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2021లో ఇచ్చిన ఉత్తర్వు(GoMs no. 120 of 2021) వ్యతిరేకమని, ఇది ఏమాత్రం ప్రజలకు పనికొచ్చే నిర్ణయం కాదని పేర్కొంది. ఈ నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నవే. అందుకే కోర్టు వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి చివాట్లే.

టికెట్ల చార్జీలను పెంచడానికి వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్లు విచారిస్తూ,  తెల్లవారుజామున 4 గంటలకు సినిమా ప్రదర్శనకు అనుమతించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్నికోర్టు తీవ్రంగా విమర్శించింది. ‘ తెల్లవారుజామున 4 గంటలకు ప్రజలు సినిమాలకు వెళ్లకుండా హాయిగా నిద్రపోవాలి " అని వ్యాఖ్యానించింది.

ఆర్థికాభివృద్ధి అంటే అంటే రాత్రంగా మేల్కొవడం కాదు. ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక మనశ్శాంతి అని పేర్కొంటూ, "మనం ఉంటున్నది ఎపుడూ నిద్రవోని న్యూయార్క్ నగరంలో కాదు అని గుర్తుంచుకోవాలి," అని కూడా కోర్టు పేర్కొంది. ఇలా వేళాపాలా లేకుండా సినిమాలు చూస్తుంటేవచ్చే ప్రయోజనం ఏమిటి అని కోర్టు ప్రశ్నించింది. నిద్రలేనిజీవితం ఎందుకు? నిద్రపోవాల్సిన సమయంలో నిద్ర పోకపోతే, నీలో ఏదో లోపం ఉందనే అర్థం అని కోర్టు కఠినంగానే వ్యాఖ్యానించింది.

ఎటువంటి చట్టం అధారం లేకుండా సినిమా టిక్కెట్ల (మల్టీ ప్లెక్స్‌లకు 100 రూపాయలు మరియు స్టాండ్-అలోన్-థియేటర్‌లకు 50 రూపాయలు) ఛార్జీలను పెంచడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక మెమోను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి విచారించారు. అనంతరం ఈ రిట్ పిటిషన్‌లో ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.కేసును జనవరి 24కు వాయిదా వేశారు.

పుష్ప-2 ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షో స్క్రీనింగ్‌కు అనుమతి లేదని ప్రకటన చేసినప్పటికీ, తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు రాష్ట్రం అనుమతించిన విషయాన్ని బెంచ్ తేలికగా తీసుకోలేదు .

" ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను, ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి 4 గంటలకు ప్రత్యేక ప్రదర్శనను ప్రదర్శించడానికి అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చింది. 10.1.2025న, నిజానికి తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షో, ప్రభుత్వం బెనిఫిట్ షోను అనుమతించారు. వారు ప్రత్యక్షంగా చేయలేరు కాబట్టి పరోక్షంగా ఈ రుూపంలో అనుమతించారు," అని కోర్టు పేర్కొంది. ర 

“ పుష్ప తర్వాత పర్మిట్ చేయనని చెప్పారు అది ఏమైంది? రేపు వారు 24 గంటల పాటు స్క్రీన్ చేయాలనుకుంటున్నామని అంటారు, మీరు అనుమతిస్తారా? మీరు ఒక ప్రయోజన ప్రదర్శన కోసం బెనిఫట్ షోల అనుమతిని తిరస్కరించారు. ఇపుడేమో తెల్లవారుజామున 4 గంటలకు అనుమతించారు, ఇది ఏమిటి? మీరు ఏ పేరు పెట్టినా అది బెనిఫిట్ షో మాత్రమే. ప్రజలు సినిమాలకు వెళ్లకుండా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోవాలనా మీ ఉద్దేశం. దీనితో రాత్రి 1 గంటకు పిల్లలను థియేటర్లకు తీసుకెళ్తున్నారు. 12 తర్వాత అన్ని సినిమా థియేటర్లను మూసేయాలి. ప్రభుత్వం చేయకపోతే, కోర్టు ఆపని చేస్తుంది. నేను రాజ్యాంగం ప్రజల జీవించే హక్కు గురించి మాత్రమే ఆందోళన చేందుతున్నాను. 16 సంవత్సరాలు వచ్చే వరకు, అర్థరాత్రి 12 తర్వాత సినిమా థియేటర్లకు వెళ్లరాదు. నేను దీన్ని నిర్ణయిస్తాను. ఆ సమయంలో పబ్ లకు కూడా వెళ్ల కుండా చేస్తాను,” న్యాయమూర్తి అన్నారు.

“You (The Government)said you will not permit after Pushpa, what happened? Tomorrow they will want to screen for 24 hours, will you allow it? You have rejected permission for a benefit show and permitted at 4 am, what is this? It is a benefit show only, whatever name you give. People should sleep at 4am not go to the movies. They are taking kids to theatres at 1 o'clock at night. Next time when the matter comes, I will close all the movie theatres after 12. If the Government won't do it, I will do… I am only concerned about the Constitution and the right to life…..Until 16 years, no one should go to movie theatres after 12. I will make that, and I will close all the pubs. I am waiting for this. What is this, what sort of rules are these? Children are coming back at 2 am. 2 am is for roaming on roads? Economic development does not mean working at night, it means economic peace. This is not New York, the city that never sleeps. They don't want to sleep.. then what is the use? Why there should be life without sleep? If you don't sleep that means there is something wrong.”

వాస్తవానికి ఈ పిటిషన్‌ను జనవరి 9న అదే రోజు ధర్మాసనం ముందు ఉంచారు. ఆ రోజు, రాష్ట్ర సూచనల మేరకు కేసు వాయిదా పడింది. ఒకే చట్టం పరిధిలోకి వస్తున్నందున కేసులలో సారూప్యం ఉన్నందున పుష్ప-2 సినిమా స్క్రీనింగ్‌ మీద వేసిన పిటిషన్లతో దీనిని ట్యాగ్ చేసి కేసును జనవరి 24న వాయిదా వేశారు.

పిటిషన్ ని సతీష్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎండీ సుల్తాన్ బాషా కేసునువాదించారు.

Tags:    

Similar News