అరుణాచలం వెళ్లేవారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-07-14 11:56 GMT

తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలంలో పౌర్ణమిరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులు వేలాదిగా వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్తుంటారు. ఈ నెల 21 న వచ్చే పౌర్ణమికి కూడా భక్తులు అరుణాచలానికి ఎక్కువశాతంలో వెళ్లే అవకాశాలున్నాయి. అందునా ఆరోజు ఆదివారం కావడం, గురుపౌర్ణమి కావడంతో, భక్తుల సంఖ్య అధికంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక తెలంగాణ నుంచి కూడా అరుణాచలం వెళ్లేవారి సంఖ్య ఎక్కువ ఉండొచ్చని అభిప్రాయపడిన ఆర్టీసీ యాజమాన్యం అందుకు తగినట్లు బస్సుల ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

"తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త! గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు." అని ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags:    

Similar News