తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.;
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టాలని నిశ్చయించుకున్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని, తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని వారు ఇది వరకే హెచ్చరించారు. అయితే ప్రభుత్వంలో కదలిక రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 6 అర్థరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మే 7న మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తామని వారు తమ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు జీతాలు రాలేదని, పండగ రోజున కూడా కుటుంబానికి ఏమీ ఇప్పించలేని స్థితిలో ఉద్యోగులు ఉన్నారని వారు తమ నోటీసుల్లో తెలిపారు.