Revanth : ‘బనకచర్లపై చర్చే జరగలేదు’

బనకచర్లపై చర్చించాలని చంద్రబాబు కొద్దిరోజులుగా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు.;

Update: 2025-07-16 13:03 GMT
Revanth

తెలుగురాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన బనకచర్ల ప్రాజెక్టుపై అసలు చర్చే జరగలేదని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) స్పష్టంగా చెప్పారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్(Central Minister CR Patil) సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వీరితో పాటు ఇరిగేషన్ శాఖల మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బనకచర్లపై చర్చించాలని చంద్రబాబు కొద్దిరోజులుగా కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఇదేసమయంలో బనకచర్లపై చర్చ జరిపే ప్రసక్తే లేదని రేవంత్ తెగేసిచెప్పారు. ఒకవేళ ప్రాజెక్టుపైన చర్చ జరగాలని కేంద్రం కూడా నిర్ణయిస్తే అసలు సమేవశానికే హాజరవ్వనని రేవంత్ గట్టిగా చెప్పారు. దాంతో తెరవెనుక ఏమైందో తెలీదు కాని దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో బనకచర్లపై అసలు చర్చే జరగలేదు.

సమవేశం తర్వాత రేవంత్(Revanth) మీడియాతో మాట్లాడుతు బనకచర్ల ప్రాజెక్టుపై సమావేశంలో అసలు చేర్చే జరగలేదని ప్రకటించారు. బనకచర్ల మీద చర్చే జరగలేదు కాబట్టి దానిపైన అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా రాలేదన్నారు. జరగని చర్చకు అభ్యంతరం చెప్పేది ఏముంటుందని మీడియానే రేవంత్ ఎదురు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలపై కమిటి వేయాలనే నిర్ణయం జరిగినట్లు రేవంత్ చెప్పారు. సమావేశంలో జరిగిన ఇతర అంశాలను రేవంత్ వివరించారు.

మొత్తానికి రేవంత్ తన పట్టును నిలుపుకున్నారు. కేంద్రంలో ఉన్నది తన మద్దతుతో నడుస్తున్న ఎన్డీయే ప్రభుత్వం కాబట్టి తాను ఏమనుకుంటే అది జరుగుతుందని చంద్రబాబు(Chandrababu) అనుకున్నట్లున్నారు. అందుకనే బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సమక్షంలో చర్చలు జరగాలని పదేపదే కోరారు. అయితే అందుకు మొదటినుండి రేవంత్ అడ్డుపడుతునే ఉన్నారు. ప్రాజెక్టు మీద చర్చలు జరగటమే అజెండా అయితే తాను అసలు మీటింగుకే రానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. దాంతో కేంద్రమంత్రి కార్యాలయం అజెండాను చివరినిముషంలో మార్చేసినట్లు సమాచారం. అందుకనే ఈ సమావేశాన్ని తెలంగాణ(Telangana) సాధించిన విజయంగా రేవంత్ అభివర్ణించింది. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు, అధికారులు చర్చలు జరుపుతారని కూడా రేవంత్ ప్రకటించారు.

Tags:    

Similar News