Manchu Family|నన్ను,నాతల్లిని చంపాలని యత్నించారు,మంచు మనోజ్ ఫిర్యాదు

మంచు మోహన్ బాబు ఇంట్లో రాజుకున్న కుటుంబ కలహాలు మరో మలుపు తిరిగాయి. తన కుటుంబంతోపాటు తన తల్లిని చంపేందుకు యత్నించారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.;

Update: 2024-12-15 14:13 GMT

మంచు మోహన్ బాబు ఇంట్లో రాజుకున్న ఘర్షణ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. గతంలో తండ్రీ కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ లు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన విచారణలో ఉండగానే ఆదివారం మంచు మనోజ్ మరోసారి పోలీసులకు తాను, తన భార్య పిల్లలు, తల్లిపై హత్యా యత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- జల్ పల్లిలోని ఇంట్లో తన తల్లి పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా కరెంటు పోయిందని, ఆ సమయంలో జనరేటరును ఆన్ చేయగా అందులో మంచు విష్ణు, మరికొందరు పంచదార పోశారని మనోజ్ ఫిర్యాదు చేశారు.
- కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని తనతోపాటు తన కుటుంబసభ్యులను కరెంటు షాక్ పెట్టి చంపాలని కుట్ర పన్నారని మనోజ్ ఫిర్యాదు చేశారు. విద్యుత్ సరఫరా కోసం బయట నుంచి తెప్పించిన జరేటర్లలో పంచదార కలిపిన డీజిల్ ను విష్ణు పోయించాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
- తన తల్లి జన్మదినం సందర్భంగా తాను పార్టీ ఏర్పాటు చేయగా, అది ఇష్టం లేక విష్ణు వచ్చి తన తల్లి, 9 నెలల తన పాప, బంధువులు ఉన్నారని, వారిని హత్య చేసేందుకు యత్నించాడని మనోజ్ ఆరోపించారు.మరో వైపు జర్నలిస్టు రంజిత్ ను కొట్టిన మోహన్ బాబు ఆసుపత్రికి వచ్చి స్వయంగా క్షమాపణలు చెప్పారు.


Tags:    

Similar News