400 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తే: శ్రీధర్ బాబు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదు. ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధమైన హక్కులు లేవని తెలిపారు.;

Update: 2025-04-01 13:40 GMT

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఒక్క అడుగు స్థలంపై కూడా వర్సిటీకి హక్కు లేదన్నారు. తాము వారం రోజుల క్రితమే వర్సిటీ వీసీ, రిజిస్ట్రాత్‌తో సమావేశమయ్యామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక మంచి పని చేయాలని భావిస్తుంటే కొందరు వ్యక్తులు, పార్టీలు కుమ్మక్కై తమపై విషయం చిమ్ముంతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీకి చెందిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదని, ఆ ఆలోచన కూడా తమ ప్రభుతవానికి లేదని చెప్పారు. మంగళవారం సెక్రటేరియట్‌లో హెచ్‌సీయూ భూముల వివాదంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగానే శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి. బీఆర్ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలనే అందరినీ తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇది వారికి తగదు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా రాజకీయాలు చేయడం మంచిది కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదు. ఇప్పటివరకు ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధమైన హక్కులు లేవు. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడేమో పని గట్టుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వారం రోజుల కిందట యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ తో మేం ప్రత్యేకంగా సమావేశమయ్యాము. వారి విజ్ఞప్తి మేరకు మా ప్రభుత్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పించేందుకు చొరవ తీసుకున్నాము. అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అసత్యం. ప్రకృతిని పరిరక్షించేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ప్రజలంతా ఒక్కటీ గమనించాలి. వాస్తవం తెలుసుకోవాలి. 2003లో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేం అధికారంలోకి వచ్చాకా సరిదిద్దాం. చట్టబద్ధంగానే ముందుకు వెళ్తాం. తప్పుడు ప్రచారంతో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, పర్యావరణ ప్రేమికులు ఆందోళన కు గురికావద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News