యాదగిరి గుట్టలో దారుణం.. ముగ్గురు బాలికలపై అఘాయిత్యం..
నమ్మించి లాడ్జిలో దారుణానికి ఒడిగట్టిన యువకులు.
యాదగిరి గుట్టలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యంలో ఘటన జరిగిన లాడ్జి యజమాని కూడా ఉన్నాడు. బాధితుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను, లాడ్జి యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్ల దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తమకు న్యాయం చేయాలని బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులు కోరుతున్నారు.
అసలేమైందంటే..
అల్వాల్‌కు చెందిన ముగ్గురు బాలికలతో ముగ్గురు యువకులు పరిచయం పెంచుకున్నారు. యాదగిరిగుట్టకు దైవదర్శనం కోసం అని బాలికలను యువకులు తమ వెంట తీసుకెళ్లారు. దైవర్శనం అయిన తర్వాత వారు బాలికలను ఒక లాడ్జీకి తీసుకెళ్లారు. అక్కడే వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో లాడ్జి యజమాని కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం బాలికలను యువకులు హైదరాబాద్‌లో వదిలి వెళ్లిపోయారు. అయితే తమ పిల్లలు రాత్రంతా రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆ తర్వాత వచ్చిన తమ పిల్లలను నిలదీశారు.
తల్లిదండ్రులు నిలదీయడంతో బాలికలు అసలు విషయాన్ని వారికి వివరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలికలు, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి పోలీసు శాఖ, ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. అయినా ఇటువంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే కనిపిస్తున్నాయి. దీంతో మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.