Tiger Attack |ఆసిఫాబాద్‌లో మళ్లీ రైతుపై మళ్లీ పులి దాడి, తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం పులి మరో రైతుపై దాడి చేసింది. శుక్రవారం లక్ష్మీ పులి దాడిలో మరణించిన ఘటన మరవక ముందే మళ్లీ మరో రైతుపై దాడి చేసి గాయపర్చింది.;

Update: 2024-11-30 10:57 GMT

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం పులి దాడి ఘటనలో (Tiger Attack) ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. సిర్పూర్ టి మండలం దుబ్బగూడ గ్రామ పొలంలో పనిచేస్తున్న సురేష్ అనే రైతుపై పులి ఆకస్మాత్తుగా దాడి చేసింది. పులి సంచరిస్తున్న గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

- పొలంలో పనిచేసేందుకు వచ్చిన సురేష్ పై పులి దాడి జరిపి తీవ్రంగా గాయపర్చింది. చుట్టుపక్కన పొలాల్లో ఉన్న రైతులు కేకలు వేయడంతో పులి పారిపోయింది. పులి దాడిలో సురేష్ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి రైతులు సురేష్ ను హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు పులి దాడులపై ప్రజలను అప్రమత్తం చేసినా మళ్లీ రెండోసారి పులి దాడి చేయడం దురదృష్ణకరమైన ఘటన అని ఆసిఫాబాద్ డీఎఫ్ఓ చెప్పారు.
- పులి వరుస దాడుల నేపథ్యంలో రైతులు అటవీప్రాంతాల సమీపంలోని పొలాలకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు కోరారు. వరుసగా రెండు రోజులపాటు పులి దాడి చేసిన నేపథ్యంలో పులి జాడ కోసం డ్రోన్ల సాయంతో అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో రెండు సార్లు పులి దాడి చేయడంతో ప్రజలు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మనుషుల రక్తం మరిగిన పులి మనుషులపై వరుస దాడులు చేస్తుందని, మ్యాన్ ఈటర్ పులి కోసం గాలిస్తున్నామని అధికారులు చెప్పారు.
మ్యాన్ ఈటర్ అయిన పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. పులి కదలికలను గుర్తించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు. గన్నారం, కడంబా, అనుకోడా, సీతానగర్, నజ్రాల్ నగర్, ఈద్గాం, ఆరెగూడ, బాబూనగర్, ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు గుర్తించారు.


Tags:    

Similar News