పులి సంచారంతో భయం భయం..
ఎస్ 12 పెద్దపులిగా గుర్తించిన ఆటవీ శాఖ;
By : B Srinivasa Chary
Update: 2025-07-14 09:57 GMT
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు కలవరపాటుకు గురయ్యారు. స్కూల్ తండాలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. తండాలో ఓ రైతుకు చెందిన ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో రైతులు ఆటవీ శాఖాధికారులకు సమాచారమిచ్చారు. రైతులు ఎవరూ కూడా ఒంటరిగా వెళ్లకూడదని ఆటవీ శాఖాధికారులు హెచ్చరించారు.
దీన్ని ఎస్ 12 పెద్దపులిగా అధికారులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో పులుల సంచారం కొ త్తేం కాదు. జిల్లాలోని ఆటవీ ప్రాంతాల నుంచి పెద్దపులులు వస్తున్నట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం పులులు ఎక్కువ సంఖ్యలో జనవాసాల్లో అడుగు పెట్టడంతో ప్రజలు భయకంపితులయ్యారు. తాజా ఘటనతో ఆటవీ సిబ్బంది రామారెడ్డి మండలంలో ట్రాప్ కెమెరాలు అమర్చింది. పులుల కదలికలను గుర్తించడానికి ఇవి దోహదపడనున్నాయి.