సీఎంతో ఇండస్ట్రీ ప్రముఖల భేటీ.. ఈ విషయాలపైనే చర్చ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గురువారం భేటీ అయ్యారు.

Update: 2024-12-26 06:44 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో గురువారం భేటీ అయ్యారు. బంగారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో దాదాపు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన వెంటనే ఇకపై రాష్ట్రంలో ఏ సినిమాకు ప్రీమియర్, బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా తాను సీఎం సీటులో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌తో భేటీ అవ్వడానికి ఇండస్ట్రీ ముందుకొచ్చింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు పాల్గొన్నారు.

సమావేశానికి హారైన వారు వీరే..

అల్లు అరవింద్, భోగవల్లి ప్రసాద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సి కళ్యాణ్, 'పుష్ప' నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన రవిశంకర్ యలమంచిలి, సూర్యదేవర నాగవంశీ, సీనియర్ నటులు మురళీమోహన్, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వశిష్ట మల్లిడి, హీరోలలో కింగ్ నాగార్జున, వెంకటేష్, కల్యాణ్ రామ్, నితిన్, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివాజీ బాలాజీ,  సిద్దు జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరుపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌దరెడ్డి, హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా, డీజీపీ జీతేందర్, చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుల సీఎం ప్రదర్శించారు.

సీఎంతో టాలీవుడ్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే!

టాలీవుడ్ ప్రముఖులతో బయటికి ముందు తెలంగాణ మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారని తెలిసింది. సినీ పెద్దలతో చర్చించాల్సిన విషయాలపై సమాలోచనలు చేసినట్లు సమాచారం అందుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడిన సీఎం తాను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. ఆ విషయంపై పునరాలోచించాల్సిందిగా రేవంత్ రెడ్డికి టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారట. దాంతో ఆ విషయం గురించి ఆలోచించి చెబుతామని సీఎం చెప్పారట. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి కూడా సినీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీలో చర్చకు వచ్చిందట. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాల గురించి దిల్ రాజు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News