హైదరాబాద్ వాసులకు అలర్ట్: రేపు ట్రాఫిక్ ఆంక్షలు
జూన్ 2న గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేసింది. జూన్ 2న ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. 10 గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'ని ఆవిష్కరించనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
జూన్ 2న గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ఆరోజు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.
Commuters are requested to note the #TrafficAdvisory in view of #TelanganaStateFormationDay Celebrations on 𝟎𝟐-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒 at #Gunpark, Nampally and #ParadeGrounds, Sec-bad. #TrafficRestrictionskindly reach us on #9010203626 for travel assistance. pic.twitter.com/86Pmba4msK— Hyderabad Traffic Police (@HYDTP) June 1, 2024
- గన్ పార్క్ పరిసరాల్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
- ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి హెచ్టీపీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.
- ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను రవీంద్రభారతి వైపు అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా జీజేఆర్ స్టాచ్యూ వైపు మళ్లిస్తున్నారు.
పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...
- పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండనున్నాయి.
- ఆలుగడ్డ బావి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాహనాలను సంగీత్ క్రాస్ రోడ్డు మీదుగా క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
- తుకారాం గేట్ నుంచి వచ్చే వాహనాలు సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా సంగీత్ క్రాస్ రోడ్డు, క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ వైపు రావాల్సి ఉంటుంది.
- సంగీత్ క్రాస్ రోడ్డు నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను వైఎంసీఏ మీదుగా క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సిటిఓ, రసూల్ పుర నుంచి బేగంపేట వైపు మళ్లిస్తారు.
- బేగంపేట నుంచి సంగీత్ క్రాస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను సిటిఓ ఎక్స్ రోడ్డు మీదుగా బాలంరాయ్, బ్రూక్ బాండ్, టివోలి, స్వీకర్ ఉపకార్, వైఎంసీఏ, సెంట్ జాన్స్ రోటరీ నుంచి సంగీత్ క్రాస్ రోడ్డు వైపు వెళ్లాలి.
- బోయినపల్లి, తాడ్బండ్ మీదుగా టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్ బాండ్ మీదుగా సీటీఓ వైపు మళ్లిస్తారు.
- కార్ఖాన, జేబీఎస్ మీదుగా ఎస్బీహెచ్ ప్యాట్నీ వైపు వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ మీదుగా టివోలి, బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు మళ్లిస్తారు.
- కార్ఖాన, జేబీఎస్ మీదుగా ఎస్బీహెచ్ ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్, మీదుగా వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ మీదుగా మళ్లిస్తారు.
- ఎస్బీఐ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ నుంచి వైఎంసీఏ, సీటీఓ వైపు మళ్లిస్తారు.
- ఆర్టీఏ తిరుమలగిరి, కార్ఖాన, మల్కాజిగిరి, సఫిల్ గూడ మీదుగా ప్లాజా వైపు వచ్చే వాహనాలను టివోలీ మీదుగా స్వీకర్ ఉపకార్, వైఎంసీఏ, బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వెళ్లాలి.
- ట్రాఫిక్ రద్దీ ఏర్పడితే టివోలి అండ్ క్లబ్ నుంచి వచ్చే వాహనాలను బోయినపల్లి మార్కెట్, ఏఓసీ వైపు మళ్లిస్తారు.
- జూబిలీహిల్స్ చెక్ పోస్టు నుంచి బేగంపేట నుంచి వచ్చే వాహనాలను పంజాగుట్ట మీదుగా ఖైరతాబాద్, గ్రీన్స్ ల్యాండ్ మీదుగా రాజ్ భవన్ వైపు మళ్లిస్తారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు...
చిలకలగూడ క్రాస్ రోడ్లు, ఆలుగడ్డ బావి క్రాస్హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్ రోడ్డు, సంగీత్ క్రాస్ రోడ్డు, వైఎంసీఏ క్రాస్ రోడ్డు, ప్యాట్నీ క్రాస్ రోడ్డు, ఎస్బీహెచ్ క్రాస్ రోడ్డు, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్. తాడ్బండ్ క్రాస్ రోడ్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయినపల్లి క్రాస్ రోడ్డు, రసూల్ పుర, బేగం పేట, ప్యారడైజ్ జుంక్షన్లు రద్దీగా ఉండే అవకాశం ఉంది.