మీకో రూల్ మాకో రూల్

ట్రాఫిక్ చలాన్లను పట్టించుకోని పోలీసన్న;

Update: 2025-06-13 12:32 GMT

హెల్మెట్ లేదనో, కారు సీటు బెల్టు లేదనో ఎడా పెడా చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు అదే శాఖకు చెందిన పోలీసు వాహనాలను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు జారి చేసిన ఏకంగా 17 వేల 391 చలాన్లు అటకెక్కాయి. ఈ జరిమానాల చెల్లింపుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులను ట్రాపిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వారి ముక్కు పిండి వసూలు చేయకుండా మిన్నకుండిపోవడంతో పోలీసు శాఖ వాహనాలు దర్జాగా రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్నాయి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 210 బి ప్రకారం చలాన్లు రెట్టింపు చేయాలి. పెండిగ్ లో ఉన్న చలాన్ల విలువ అక్షరాల 68 లక్షలు అని చెబితే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఒక వేళ రెట్టింపు అయితే మాత్రం మొత్తం కోటి 36 లక్షలు కట్టాల్సిందే. విషయం బయటకు పొక్కడానికి కారణం హైద్రాబాద్ వాసి లోకేంద్ర సింగ్. సమాచార హక్కుచట్టం క్రింద విషయం బయటకు పొక్కింది.

కాకి డ్రెస్ వేసుకుని ఉన్నా వాహనం మీద పోలీస్ అనే స్టిక్కర్ ఉంటే ట్రాఫిక్ పోలీసులు అటువైపు కూడా చూడరు. ఆటో మేటెడ్ కెమెరాలు ఉన్నప్పటికీ పోలీసు వాహనాలను క్లిక్ మనిపించే పరిస్థి తి లేదు. ఓవర్ స్పీడ్ , నిర్లక్ష్యం డ్రైవింగ్ చేసిన వారిని ట్రాఫిక్ పోలీసులు చూసొచూడనట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసు వాహనాలన్నీ డిజిపి పేరిట రిజిస్టర్ అవుతున్నాయి. చలాన్లు కూడా డిజిపి పేరిట వస్తుంటాయి. రాష్ట్ర పోలీసు బాసు పేరిట చలాన్లు రావడంతో నిబంధనలు ఏ మాత్రం అమలవుతున్నాయో వేరే చెప్పక్కర్లేదు. ఓవర్ స్పీడ్ ,రాంగ్ పార్కింగ్ చలాన్లు పోలీసు వాహనాలవే ఉండటం శోచనీయం. ఈ చలాన్లు కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి. 2017 నాటి చలాన్లు కోకొల్లలు.


Similar News