నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దిండి వాగులో ముగ్గురు కొట్టుకుపోయారు. చందంపేట మండలం దేవరచర్ల గ్రామంలో పండుగ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ముగ్గురు నీళ్లలో కొట్టుకుపోయారు
పండుగ పూట తెనాలి నుంచి వచ్చిన బంధువులు దిండి వాగులో సరదాగా గడుపుతున్నారు. ఇటీవలె కురిసిన భారీ వర్షాలకు దిండి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. 9 ఏళ్ల ఉమాకాంత్ వాగులో కొట్టుకుపోతుండగా 30 ఏళ్ల రాజు రక్షించబోయి తాను కొట్టుకుపోయాడు. వీరిద్దరిని రక్షించబోయి 22 ఏళ్ల భరత్ కుమార్ కూడా వాగులో కొట్టుకుపోయాడు.