హైదరాబాద్ లో భారీ ఏఐ సెంటర్

ప్రపంచ ప్రముఖ ఐటి కంపెనీల్లో ఒకటైన ట్రైజిన్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో రెండో సెంటర్ను ఏర్పాటుచేయటానికి అంగీకరించింది.

Update: 2024-08-07 03:50 GMT
Revanth with trigyn CEO

ప్రపంచ ప్రముఖ ఐటి కంపెనీల్లో ఒకటైన ట్రైజిన్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో రెండో సెంటర్ను ఏర్పాటుచేయటానికి అంగీకరించింది. అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి ట్రైజిన్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. చర్చలు ఫలించి హైదరాబాద్ లో రెండో కేంద్రం ఏర్పాటుచేయటానికి యాజమాన్యం సుముఖత వ్యక్తంచేసింది. మరో ఆరునెలల్లోనే రెండో సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గడచిన 20 ఏళ్ళుగా ప్రపంచబ్యాంకుతో పాటు దాని అనుబంధ సంస్ధలకు ప్రపంచ వ్యాప్తంగా ట్రైజిన్ టెక్నాలజీస్ తన సేవలను అందిస్తోంది. ఆరునెలల్లో ఏర్పాటుచేయబోయే రెండో సెంటర్ లో మూడేళ్ళల్లో వెయ్యిమందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది.

160 మిలియిన్ డాలర్ల ఆదయం ఉన్న ట్రైజిన్ కు ఇపుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కేంద్రాలున్నాయి. వీటిల్లో ఇపుడు 2500 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో వెయ్యిమంది ఇండియాలోనే ఉన్నారు. వీరిలో కూడా వందమంది హైదరాబాద్ కేంద్రంలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ కేంద్రాల్లో కలిపి పనిచేస్తున్నది 2500 మందే అంటే యాజమాన్యం విస్తరణ విషయంలో ఎంత గట్టిగా ఉంటుందో అర్ధమవుతోంది. ఏ దేశంలో పడితే ఆ దేశంలో విస్తరణ చేపట్టి ఉద్యోగులను తీసుకోదు. హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే రెండో సెంటర్లో డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ కంపెనీలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు శిక్షణ తదితరాలపైన ట్రైజిన్ ఎక్కువగా దృష్టిపెడుతుంది.

అలాగే సాంకేతికత, సేవల పరిష్కారంలో చాలా పాపులరైన ఆర్సీసీఎం సంస్ధ కూడా తెలంగాణాలో సెంటర్ ను ఏర్పాటుచేయటానికి తెలంగాణా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే పనిచేస్తున్న ఈ సంస్ధకు విదేశాల్లో ఎక్కడా సెంటర్లు లేవు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఒక సెంటర్ను ఏర్పాటు చేయటానికి యాజమాన్యం అంగీకరించింది. రేవంత్ బృందం కంపెనీ సీఈవో గౌరవ్ సూరితో చాలాసేపు సమావేశమై హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేస్తే కంపెనీతో పాటు తెలంగాణాలోని యువతకు జరిగే లాభాలను వివరించింది. దాంతో హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు. సెంటర్ ఏర్పాటైన దగ్గర నుండి రెండేళ్ళల్లో 500 మంది నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.

తన పర్యటనలో కాగ్నిజెంట్ యాజమాన్యంతో మాట్లాడిన రేవంత్ బృందం హైదరాబాద్ లో రెండో కేంద్రం ఏర్పాటుకు ఒప్పించిన విషయం తెలిసిందే. ఈ కేంద్రంలో 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడినపుడు రేవంత్ బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్వ్యూరెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు స్టార్టప్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రేవంత్ హామీ ఇస్తున్నారు. మొత్తంమీద పెట్టుబడుల ఆకర్షణకు రేవంత్ అమెరికా, దక్షిణకొరియా పర్యటన ఫలమైందనే అనుకోవాలి.

Tags:    

Similar News